- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాచిగూడలో యువతిపై అత్యాచారం
<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో యువతిపై భరత్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. సుందర్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే బాలికకు మాయ మాటలు చెప్పి కొన్నేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న భరత్.. శనివారం తెల్లవారుజామున 4.30గంటల సమయంలో యువతి ఇంటికెళ్లాడు. బైక్‌పై యువతిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతలోనే యువతి తల్లికి మెలకువ రావడంతో చూడగా కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారితో […]</p>

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో యువతిపై భరత్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. సుందర్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే బాలికకు మాయ మాటలు చెప్పి కొన్నేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న భరత్.. శనివారం తెల్లవారుజామున 4.30గంటల సమయంలో యువతి ఇంటికెళ్లాడు. బైక్‌పై యువతిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతలోనే యువతి తల్లికి మెలకువ రావడంతో చూడగా కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారితో కలిసి కాలనీ మొత్తం తిరిగారు. కొంతసేపటికి ఇంటికి చేరుకున్న యువతిని ఎక్కడికి వెళ్లావని అడగడంతో విషయం మొత్తం చెప్పింది. అందరు కలిసి యువకుడిని పిలిపించి మాట్లాడగా.. ఆమె కులం వేరు.. నా కులం వేరంటూ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.






