- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పబ్‌బీ ఆడొద్దు అన్నందుకు యువకుడు ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, కుత్బుల్లాపూర్: పబ్ జీ గేమ్ ఆడొద్దన్నందుకు ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన గణేష్ రాజ్ కుటుంబం గత కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్ సర్కిల్ రామిరెడ్డి నగర్‌లో నివాసముంటున్నారు. అయితే, అతని కుమారుడు శివరాజ్ బహర్ (20) పబ్ జీ గేమ్‌కు బానిసగా మారాడు. కూలీ పనులు చేసుకొని జీవించే మనకు […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్: పబ్ జీ గేమ్ ఆడొద్దన్నందుకు ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన గణేష్ రాజ్ కుటుంబం గత కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్ సర్కిల్ రామిరెడ్డి నగర్‌లో నివాసముంటున్నారు. అయితే, అతని కుమారుడు శివరాజ్ బహర్ (20) పబ్ జీ గేమ్‌కు బానిసగా మారాడు. కూలీ పనులు చేసుకొని జీవించే మనకు పనికి పోకుంటే కుదరదని, నిత్యం ఫోన్‌లో పబ్ జీకి బానిసగా మారడం ఏంటని తల్లిదండ్రులు మందలించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శివరాజ్ ఇంట్లోని ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






