తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: మెడకు ఉరి తాడుతో యువకుడు నిరసన

by Shyam |

<p>దిశ, మక్తల్:  హిందీ పండితులకు టీఆర్టీ పరీక్ష రాసేందుకు ఉత్తమ అనుమతి ఇవ్వాలని నరసింహ అనే యువకుడు మెడకు తాడు చుట్టుకుని స్వామి వివేకానంద విగ్రహం ముందు నిరసన తెలిపిన సంఘటన ఉట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్వార్ గ్రామంలో బుధవారం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నిరసన చేయడం వల్ల తమపై ప్రభుత్వంకు కనువిప్పు కల్గుతుందన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో 25 వేల మంది హెచ్ పి టి ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని వారందరూ [&hellip;]</p>

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: మెడకు ఉరి తాడుతో యువకుడు నిరసన
X

దిశ, మక్తల్: హిందీ పండితులకు టీఆర్టీ పరీక్ష రాసేందుకు ఉత్తమ అనుమతి ఇవ్వాలని నరసింహ అనే యువకుడు మెడకు తాడు చుట్టుకుని స్వామి వివేకానంద విగ్రహం ముందు నిరసన తెలిపిన సంఘటన ఉట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్వార్ గ్రామంలో బుధవారం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నిరసన చేయడం వల్ల తమపై ప్రభుత్వంకు కనువిప్పు కల్గుతుందన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో 25 వేల మంది హెచ్ పి టి ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని వారందరూ ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని నరసింహ చెబుతున్నాడు.

పక్క రాష్ట్రంలో హిందీ పండిట్ ట్రైనింగ్ చేసిన వారికి టీఆర్టి రాసేందుకు అవకాశం ఇచ్చి హిందీ పండితులుగా ఉద్యోగ నియామకాలు చేసిందన్నాడు. పరాయి పాలనలో నీళ్లు , నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగిందని పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో చదువుకున్న యువతకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడంతో చదువుకున్న యువకులు దిక్కుతోచని పరిస్థితి పోట్ట కూటికోసం ఇతర రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్ళి జీవనం కోనసాగిస్తున్నారన్నాడు. హిందీ పండిట్ ట్రైనింగ్ వాళ్ళపై ప్రభుత్వం కనికరించి టిఆర్టి టెస్టు రాసేందుకు తమకు అవకాశం కల్పించా లని నరసింహ ప్రభుత్వాన్ని వేడుకున్నారు

Next Story