- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం తీసిన మూలమలుపు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : బైక్ అదుపు తప్పి ఒకరు మృతిచెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. మూలమలుపులో బైక్ టైర్ స్క్రిడై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ సాయి ప్రశాంత్ వివరించారు. మఠంపల్లి మండల బక్కమంతుల గూడెం గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి, కారింగుల సతీష్ బైక్ పై మహబూబాబాద్ వెళుతున్నారు. కుంటపల్లి గ్రామ శివారులోని మూలమలుపు వద్దకు రాగానే బైకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బైక్ అదుపు తప్పి ఒకరు మృతిచెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. మూలమలుపులో బైక్ టైర్ స్క్రిడై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ సాయి ప్రశాంత్ వివరించారు.

మఠంపల్లి మండల బక్కమంతుల గూడెం గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి, కారింగుల సతీష్ బైక్ పై మహబూబాబాద్ వెళుతున్నారు. కుంటపల్లి గ్రామ శివారులోని మూలమలుపు వద్దకు రాగానే బైకు అదుపు తప్పి ఇద్దరు కిందపడిపోయారు. ఈ ఘటనలో కారింగుల సతీష్ అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీధర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రున్ని 108 వాహనంలో సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. సతీష్ తండ్రి కారింగుల నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.
Next Story






