- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువహీరో ఆత్మహత్య.. తెరవెనుక ఏం జరుగుతోంది?
<p>దిశ, వెబ్‌డెస్క్ : సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఓ వైపు కరోనా రక్కసి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటే..మరోవైపు ఇండస్ట్రీలో ప్రముఖుల వరుస మరణాలు మరింత బాధిస్తున్నాయి. రీసెంట్‌గా యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌తో బాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇంతలోనే మరో యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ దిగ్బాంత్రికి గురిచేసింది. మరాఠీలో అందరికీ సుపరిచితుడైన యంగ్ హీరో అశుతోష్ భక్రే ఉరేసుకుని ప్రాణాలు తీసున్నాడు. బుధవారం సాయంత్రం […]</p>

దిశ, వెబ్‌డెస్క్ :
సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఓ వైపు కరోనా రక్కసి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటే..మరోవైపు ఇండస్ట్రీలో ప్రముఖుల వరుస మరణాలు మరింత బాధిస్తున్నాయి. రీసెంట్‌గా యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌తో బాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇంతలోనే మరో యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ దిగ్బాంత్రికి గురిచేసింది.
మరాఠీలో అందరికీ సుపరిచితుడైన యంగ్ హీరో అశుతోష్ భక్రే ఉరేసుకుని ప్రాణాలు తీసున్నాడు. బుధవారం సాయంత్రం మహారాష్ట్రలోని నాందెడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. అశుతోష్ భక్రే గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భక్రే సన్నిహితులు భావిస్తున్నారు. యువనటుడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






