ఆపేయ్ నువ్వు పాటపాడొద్దు.. నెట్టింట్లో మాజీ సీఎం భార్య ట్రోల్

108

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల అమృత ఫడ్నవీస్ ఓ పాట పాడారు. అయితే ఆ పాటను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మహరాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ దావ్ అందార్ పేరుతో మరాఠీ సినిమా కోసం ఆమె పాట పాడారు. భయం, అనిశ్చితి ల సంగమమే ఈ పాట అంటూ ట్వీట్ చేశారు. అలా పాటా గురించి ట్వీట్ చేశారో లేదో .. ఆమెపై ట్రోలింగ్ స్టార్టయ్యింది. దావ్ అంధాన్ అనే మరాఠీ సినిమాలో గుల్షన్, సాగరికా ఘట్గే ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు జీత్ గంగూలీ సంగీతం సమకూర్చగా.. ఈ జాజ్ గీతాన్ని అమృతా ఫడ్నవీస్ పాడారు. ఆమె పాడిన పాటపై పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. యూఎస్‌కు వెళ్లాలని.. అక్కడ క్యాపిటల్ హిల్ ముందు పాట పాడాలని సూచిస్తున్నారు. అలా పాట పాడితే అక్కడ నిరసన చేస్తున్న వారంతా పారిపోతారంటూ కామెంట్ చేస్తున్నారు.