వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడతాం: బీజేపీ

by  |
somu virraju
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌‌‌‌షాతో సోము వీర్రాజు భేటి అయ్యారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా నేతలు శ్రమించాలని హోంశాఖ మంత్రి అమిత్‌‌షా దిశా నిర్దేశం చేశారు. తిరుపతిలో ఏపీ బీజేపీ నేతలతో అమిత్‌‌‌షా భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని, అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని దాన్ని క్యాష్ చేసుకునేందుకు నేతలు కార్యక్రమాలు చేపట్టాలని అమిత్‌‌‌షా సూచించినట్లు స్పష్టం చేశారు. అంతే కాక ఏపీలో ముఖ్యమైన నేతలను బీజేపీలో చేర్చుకుని 2024లో రాష్ట్రంలో అధికార పగ్గలు చేపట్టే దిశగా కార్యచరణ రూపొందించుకుంటామని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుందని.. ఏపీలో గ్రామీణాభివృద్ధికి సహకారమందిస్తామని అమిత్‌‌షా హామీ ఇచ్చినట్లు సోము వీర్రాజు స్పష్టం చేశారు.

బీజేపీ ప్రజావాణి కావాలన్నదే మా లక్ష్యం

రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి అన్నారు. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్‌‌షా తమకు దిశా నిర్దేశం చేశారని ఆమె తెలిపారు. ‘రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఏపీ విభజన బిల్లు అంశాలపై అమిత్ షాతో చర్చించాం. విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చింది. మిగిలిన 20శాతం అంశాలపై కూడా చర్చించాం’ అని పురంధేశ్వరి తెలిపారు.

Next Story