- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకావాలని పార్టీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలను సీఎం జగన్ ఖరారు చేయనున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, రుణపరిమితి తగ్గింపు అంశం, ప్రత్యేక హోదా, పునర్విభజన […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకావాలని పార్టీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు.
అనంతరం పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలను సీఎం జగన్ ఖరారు చేయనున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, రుణపరిమితి తగ్గింపు అంశం, ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరానికి నిధుల విడుదల, కృష్ణా జలాల వివాదం, ఉమ్మడి ప్రాజెక్ట్‌లను కేంద్రం పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లపై ఈ సమావేశంలో ఎంపీలు చర్చించనున్నారు.
Next Story






