- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీలో మహిళా హోటల్ మేనేజర్ పై యువకుడి దాడి.. షాకింగ్ వీడియో వైరల్
యూపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా మేనేజర్ పై యువకుడు దాడి చేసి అక్కడ నుండి పారిపోయాడు. ఈ ఘటన ఘజియాబాద్ లోని ఇందిరాపురం శక్తి బ్లాక్ లో ఉన్న హోటల్ యువరాజ్‌లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: యూపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా మేనేజర్ పై యువకుడు దాడి చేసి అక్కడ నుండి పారిపోయాడు. ఈ ఘటన ఘజియాబాద్ లోని ఇందిరాపురం శక్తి బ్లాక్ లో ఉన్న హోటల్ యువరాజ్‌లో చోటు చేసుకుంది. హోటల్‌కు వచ్చిన యువకుడు, మేనేజర్ మధ్య గొడవ జరగ్గా అతడు ఇద్దరూ ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో యువకుడు విచక్షణ కోల్పోయి మహిళపై ఒక్కసారిగా దాడికి దిగాడు. పక్కనే రిసెప్షనిస్ట్ కూర్చుని ఉండగా యువకుడు మేనేజర్ మహిళ అని కూడా చూడకుండా ఆమెపై దాడి చేశాడు.
ఆమె ప్రతిగటిస్తున్న సమయంలో బయటకు పారిపోయాడు. మేనేజర్ అతడి వెంటనే పరిగెత్తినప్పటికీ అతడు వేగంగా తప్పించుకున్నాడు. మేనేజర్ పై దాడి ఘటన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో యువకుడు చూస్తే చదువుకున్నవాడిలా ఉన్నాడని, మహిళపై దాడి చేసేవరకు వెళ్లింది అంటే ఇద్దరి మధ్య ఏదో పెద్ద గొడవనే జరిగిందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






