woman suicide: గుండెలు పిండే విషాదం.. కరెంట్ బిల్లు కోసం ట్రీట్ మెంట్ డబ్బులు.. చివరకు..

by Prasad Jukanti |   ( Updated:2024-07-29 08:12:21.0  )
woman suicide: గుండెలు పిండే విషాదం.. కరెంట్ బిల్లు కోసం ట్రీట్ మెంట్ డబ్బులు.. చివరకు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోజు రోజుకు పెరిగిపోతున్న ధరలు ప్రపంచ వ్యాప్తంగా సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చేసిన సంపాదన అంతా తిండికి, వైద్యానికే ఖర్చైపోతుంటే మరోవైపు ప్రభుత్వాలు మోపుతున్న పన్నుల భారంఊపిరి సలపనివ్వడం లేదు. ట్రీట్ మెంట్ కోసం దాచుకున్న డబ్బులను విద్యుత్ బిల్లుకు చెల్లించాల్సి రావడంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పపడటం కలకలం రేపింది. ఈ విషాద ఘటన పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఇటీవల అక్కడి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు, పన్నులను భారీగా పెంచింది. ఈ పెంపుకు నిరసనగా పెద్ద ఎత్తున నిరలకనలు సైతం కొనసాగుతున్నాయి. అయితే పంజాబ్ లో రజియా బీబీ (65) అనే మహిళ హెర్నియా వ్యాధితో బాధపడుతున్నది. ఇటీవల అనూహ్యరీతిలో ఆమెకు 10 ,0000 (పాకిస్థానీ కరెన్సీ) విద్యుత్ బిల్లు వచ్చింది. ఇంత మొత్తం బిల్లును చూసిన ఆమె షాక్ కు గురైంది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె మరో మార్గం లేక తన హెర్నియా వ్యాధికి అపరేషన్ కోసం దాచుకున్న డబ్బును విద్యుత్ బిల్లును చెల్లించింది. అనంతరం తీవ్ర మనస్తాపంతో సమీపంలోని కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనపై గుజ్రాన్‌వాలా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story