Fire flies Tours : మిణుగురులను చూసేందుకు వెలుతారా ?

by Y. Venkata Narasimha Reddy |

రాత్రి వేళల్లో పల్లెల్లో...పంట పొలాల్లో..నీటి వనరుల చెంత మిలమిల మెరుస్తూ ఎగురుతూ సాగే మిణుగురుల(Sparkles) మెరుపులు చూపరులకు కనువిందు చేస్తుంటాయి.

Fire flies Tours : మిణుగురులను చూసేందుకు వెలుతారా ?
X

దిశ, వెబ్ డెస్క్ : రాత్రి వేళల్లో పల్లెల్లో...పంట పొలాల్లో..నీటి వనరుల చెంత మిలమిల మెరుస్తూ ఎగురుతూ సాగే మిణుగురుల(Sparkles) మెరుపులు చూపరులకు కనువిందు చేస్తుంటాయి. ఆకాశంలో నక్షత్రాలు నేల వాలయా అన్నట్లుగా అనిపించే మిణుగురులు క్రమంగా పారిశ్రామిక విస్తరణ.. జీవ వైవిధ్యం క్షీణత..బౌగోళిక పరిస్థితుల మార్పుల నేపథ్యంలో కనుమరువుతున్నాయి. అయితే ప్రపంచంలో మిణుగురులను చూసేందుకు సైతం పర్యాటక ప్రాంతాలు..ప్రత్యేక టూర్లు కూడా ఉన్నాయి.

ఫిలిప్పీన్స్‌లో(Philippine Islands)ని బోహో, పాలవాన్‌, సిక్విజార్‌ ద్వీపాలు మిణుగురుల బోట్‌ టూర్లకు ప్రసిద్ధి. రాత్రి వేళల్లో అక్కడి నదుల్లో పడవ విహారం ఓ అబ్బురం అయితే, చెట్లపై మిలమిలా మెరిసే వేలాది మిణుగురులను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఈ ఫైర్‌ఫ్లైస్‌ టూర్లకు సరైన సీజన్‌ మార్చి నుంచి మే నెల వరకు కొనసాగనుంది. వర్షాకాలంలో తప్ప మిగతా కాలాల్లో ఈ ‘ఫైర్‌ఫ్లైస్‌ టూర్స్‌’ అందుబాటులో ఉన్నాయి. ఈ సమయంలో అక్కడ టూరిస్టుల హడావుడి కాస్త ఎక్కువే. మిణుగురు సమూహాల అందాలను చూసేందుకు పర్యాటకులు ఎగబడుతుంటారు.

ఫిలిప్పీన్స్‌, జపాన్‌ దేశాల్లో మిణుగురు యాత్రలకు టూరిస్టుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతోంది. రాత్రివేళ బోట్ లలో విహరిస్తూ మిణుగురులను చూడాలంటే ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌ టూర్ కు వెళ్లవచ్చు.

Next Story