- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నరకానికి స్వాగతం..అమెరికాకు మరో ఇరాన్ వార్నింగ్
నరకానికి స్వాగతం అంటూ అమెరికాకు మరో ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. సైనికులను పంపినందుకు గాను ఈ ప్రకటన చేసింది.

దిశ, వెబ్ డెస్క్: యుద్ధానికి ట్రంప్ తాత్కాలిక విరమణ ఇచ్చినప్పటికీ.. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమకు భయపడి ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటించాడని ఇరాన్ ర్యాగింగ్ చేస్తోంది. అయితే ఈ గ్యాప్ లోనే ఇరాన్ లోకి పది వేల మంది సైన్యాన్ని అమెరికా పంపబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.
తమ దేశంలోకి 10,000 మంది సైన్యాన్ని పంపుతోన్న అమెరికాకు ఇరాన్ మీడియా హెచ్చరికలు జారీ చేసింది. నరకానికి స్వాగతం అంటూ టెహ్రాన్ టైమ్స్ తన మొదటి పేజీలో హెడ్ లైన్ పెట్టి అమెరికాకు షాక్ ఇచ్చింది. ఇరాన్ గడ్డపైన అడుగుపెట్టే, ఏ అమెరికా సైనికుడైనా శవపేటికలోకే చేరుకుంటాడని డేంజర్ బెల్స్ పంపింది మీడియా సంస్థ. అయితే ఈ న్యూస్ బయటకు వచ్చిన కొద్దిసేపటికి తొలి విడతలో అమెరికాకు చెందిన 3500 మందితో కూడిన సైన్యం మిడిల్ ఈస్ట్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. నిజంగానే ఇది జరిగితే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని అంటున్నారు.






