Netanyahu: ఢిల్లీలో నెతన్యహు కు వ్యతిరేకంగా ‘ వాంటెడ్ ’ పోస్టర్లు

by Shamantha N |

ఢిల్లీలో ఇజ్రాయిల్ ప్రధానికి వ్యతిరేకంగా ‘వాంటెడ్’ పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీలోని బెల్జియం ఎంబసీ (Belgian Embassy) సిబ్బంది చేసిన పనిగా దీన్ని గుర్తించారు.

Netanyahu: ఢిల్లీలో నెతన్యహు కు వ్యతిరేకంగా ‘ వాంటెడ్ ’ పోస్టర్లు
X

దిశ, నేషనల్ డెస్క్ : ఢిల్లీలో ఇజ్రాయిల్ ప్రధానికి వ్యతిరేకంగా ‘వాంటెడ్’ పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీలోని బెల్జియం ఎంబసీ (Belgian Embassy) సిబ్బంది చేసిన పనిగా దీన్ని గుర్తించారు. చాణక్యపురి ప్రాంతంలో ఉన్న బెల్జియం ఎంబసీ ప్రాంగణంలో రెండు స్తంభాలపై ‘వాంటెడ్’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని ఫొటోతో ఉన్న పోస్టర్లను అతికించారు. మొత్తం 50 సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి పోస్టర్లు అతికించింది బెల్జియం ఎంబసీలో పనిచేసే వ్యక్తేనని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎందుకు ఇలా పోస్టర్లు అతికించాడో విచారణలో తేలనుంది.

కేంద్ర హోం శాఖకు వివరాలు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఢిల్లీ పోలీసులు ఈ ఘటన గురించి పూర్తి వివరాలు అందజేశారు. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం బెల్జియం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న సైనిక కార్యకలాపాలను బెల్జియం చాలా సందర్భాల్లో ఖండించింది. 2023లో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిస్తూ యూఎన్ చేసిన తీర్మానానికి అనుకూలంగా బెల్జియం ఓటు వేసింది. మొత్తం 121 దేశాలు కాల్పుల విరమణకు ఓకే చెబుతూ ఓటేశాయి. గతేడాది ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేయాలన్న పిటిషన్ కు కూడా బెల్జియం మద్దతు తెలిపింది.


Next Story