- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు.. పైలట్ ఉరుకొచ్చి ఆపినా..
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఆ వీడియోను..Viral Video: Brawl Breaks Out On Flight, Passengers Throw Punches At Each Other

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మాంచెస్టర్ నుండి ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు వెళుతున్న విమానంలో ఆరుగురు ప్రయాణికులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకంటే ముందు విమానంలో పెద్ద గొడవ జరిగింది. ఈ ఆరుగురు ప్రయాణికులు మరో ప్రయాణికుడి పట్ల జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో వాగ్వాదం చెలరేగింది. దీంతో వీరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ సమయంలో పైలట్, సిబ్బంది వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయినా కూడా కాసేపు కొట్లాట కొనసాగింది. ఇదంతా వీడియో తీసిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. గొడవ జరిగింది నిజమేనని, ఆరుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
Next Story






