గెలిచాక ఎక్క‌డికీ వెళ్లొద్దు.. టీవీకే నేత‌ల మీటింగ్ లో విజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు

by Ajay Maddhiboyina |

ఇటీవ‌ల త‌మిళ‌నాడు ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో స్టార్ హీరో విజ‌య్ పార్టీ టీవీకే తొలిసారి బ‌రిలో దిగింది.

గెలిచాక ఎక్క‌డికీ వెళ్లొద్దు.. టీవీకే నేత‌ల మీటింగ్ లో విజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇటీవ‌ల త‌మిళ‌నాడు ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో స్టార్ హీరో విజ‌య్ పార్టీ టీవీకే తొలిసారి బ‌రిలో దిగింది. ఎన్నిక‌ల త‌ర‌వాత వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్ లో డీఎంకేనే మ‌రోసారి విజ‌యం సాధిస్తుంద‌ని తేలినా విజ‌య్ పార్టీకి కూడా ఎక్కువే స్థానాలు వ‌స్తాయ‌ని కూడా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఒకవేళ హంగ్ ఏర్పడితే విజయ్ పార్టీకి కూడా ప్రభుత్వం ఏర్పడటంతో కీ రోల్ పోశించే అవకాశం ఉంది. అదృష్టం క‌లిసి వ‌స్తే విజ‌య్ సీఎం అయ్యే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీంతో విజ‌య్ ముందే బ‌రిలో దిగిన అభ్య‌ర్థుల‌ను గ్రిప్ లో పెట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో నేడు పార్టీ నేత‌ల‌తో ముఖ్య స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. అభ్య‌ర్థుల‌కు సూచ‌న‌గా కాకుండా విజ‌య్ చెప్ప‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గెలిచిన త‌ర‌వాత ఎవ‌రూ ఎక్క‌డికీ వెళ్ల‌వ‌ద్ద‌ని నేరుగా ప‌నైయూర్ కు రావాల‌ని విజ‌య్ ఆదేశించారు. సంబ‌రాలు అంటూ మీ నియోజ‌క‌వ‌ర్గాలకు కూడా వెళ్లొద్ద‌ని హెచ్చ‌రించారు. ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర‌వాత తిరిగి నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లాల‌ని అన్నారు. తాను ఇక్క‌డే గెలిచిన నేత‌ల కోసం ఎదురుచూస్తాన‌ని, మ‌నం గెలుస్తామ‌నే న‌మ్మ‌కం నాకు ఉంది అంటూ విజ‌య్ వ్యాఖ్యానించారు. దీంతో విజ‌య్ టీవీకే గెలుపుపై ధీమాగా ఉన్నార‌ని అర్థం అవుతోంది.

Next Story