- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NICOLAS MADURO: చేతికి సంకేళ్లు, చుట్టూ పోలీసులు.. బయటికి వచ్చిన వెనుజులా అధ్యక్షుడి వీడియో
వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికరా దళాలు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వెనుజులాలో బాంబుల వర్షం కురిపించిన అమెరికా దళాలు స్పెషల్ ఫోర్స్ తో ఆ దేశ అధ్యక్షుడు మదురోను కారకాస్ లో అరెస్ట్ చేశాయి.

దిశ, వెబ్ డెస్క్: వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికరా దళాలు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వెనుజులాలో బాంబుల వర్షం కురిపించిన అమెరికా దళాలు స్పెషల్ ఫోర్స్ తో ఆ దేశ అధ్యక్షుడు మదురోను కారకాస్ లో అరెస్ట్ చేశాయి. ఆయన సతీమణిని సైతం అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం వారిని న్యూయార్క్ తీసుకువెళ్లారు. అయితే మదురో చేతికి సంకెళ్లు వేసి డీఈఏ కేంద్రానికి తరలిస్తున్న వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.
చుట్టూ అమెరికా పోలీసుల మధ్యలో మదురో సంకెళ్లతో కనిపిస్తున్నారు. ఆయన ఎలాంటి ఆందోళన లేకుండా పోలీసులకు న్యూఇయర్ విషెస్ చెబుతున్నారు. అనంతరం ఆయనను మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం కేసుల్లో విచారించడానికి బ్రూక్లిన్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. ఇక ప్రస్తుతం వెనుజులా అధ్యక్షుడి వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఓ దేశ అధ్యక్షుడినే అమెరికా ఇలా తీసుకువెళుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. VIDEO






