- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన పోస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వలస విధానంపై చర్చకు దారితీసింది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వలస విధానంపై చర్చకు దారితీసింది. ఆయన అమెరికా వలస, జాతీయత చట్టం (Immigration and Nationality Act - INA) లోని సెక్షన్ 212(f) ను ఉటంకిస్తూ, అమెరికా అధ్యక్షుడికి ఉన్న అపారమైన అధికారాలను నొక్కి చెప్పారు. తన ట్వీట్‌లో "ఒకవేళ, ఏ విదేశీయుడైనా లేదా ఏ తరగతికి చెందిన విదేశీయుల ప్రవేశమైనా యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రయోజనాలకు హానికరం అని అధ్యక్షుడు భావిస్తే, ఆయన ఒక ప్రకటన (Proclamation) ద్వారా, అధ్యక్షుడు అవసరమని భావించినంత కాలం, వలసదారులుగా (immigrants), వలసేతరులుగా (nonimmigrants) ఉన్న విదేశీయులందరి ప్రవేశాన్ని నిలిపివేయవచ్చు, అధ్యక్షుడు తగినదని భావించే ఏవైనా ఆంక్షలను వారి ప్రవేశంపై విధించవచ్చు." అని రాసుకొచ్చారు
. ఈ సెక్షన్ చట్టపరంగా అమెరికా అధ్యక్షుడికి విదేశీయుల ప్రవేశాన్ని దేశ ప్రయోజనాల దృష్ట్యా నిలిపివేసే, పరిమితం చేసే అత్యంత విస్తృతమైన అధికారాన్ని కల్పిస్తుంది. ట్రంప్ తన పదవీ కాలంలో, ప్రసిద్ధి చెందిన 'ట్రావెల్ బ్యాన్' (Travel Ban) సహా పలు కీలక వలస నిర్ణయాలను అమలు చేయడానికి ఈ 212(f) సెక్షన్‌ను ఉపయోగించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో, వలస విధానాన్ని మరింత కఠినతరం చేస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించినందున, ఆయన ఈ చట్టాన్ని ఉటంకించడం ప్రాధాన్యత సంతరించుకుంది.






