- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుతిన్ జెలెన్‌స్కీని బంధిస్తే ఏం చేస్తారు? ట్రంప్‌పై యూఎస్ ఎంపీ ఫైర్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజులా దేశంపై మెరుపు దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజులా దేశంపై మెరుపు దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అరెస్ట్ పై భారత సంతతికి చెందిన యూఎస్ ఎంపీ రో ఖన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర ధోరణులకు దారి తీస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఒక దేశాధ్యక్షుడిని బంధించడాన్ని సమర్ధించుకుంటే రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని అరెస్ట్ చేసినా, చైనా తైవాన్ పై దాడి చేసినా మనం ఏ ముఖం పెట్టుకుని ప్రశ్నిస్తామని అడిగారు. ట్రంప్ తన మాగా మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ మద్దతుదారులను వంచించారని రో ఖన్నా ఫైర్ అయ్యారు. విదేశీ యుద్ధాలకు స్వస్తి పలికి దేశీయ సమస్యలపై దృష్టి పెడతానని చెప్పిన ట్రంప్ వెనుజులాతో అనవసరమైన యుద్ధాన్ని మొదలుపెట్టారని పేర్కొన్నారు. ఇరాన్, లిబియా, ఆఫ్గనిస్తాన్ లాంటి దేశాల్లో అమెరికా చేసిన పాత తప్పులనే ఇప్పుడు వెనుజులలో పునరావృతం చేస్తున్నారని మండిపడ్డారు.






