- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్ సంచలన నిర్ణయం.. మరో 7 దేశాలపై యూఎస్ ట్రావెల్ బ్యాన్
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ సంచలన నిర్ణయాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయాడు.

దిశ, వెబ్ డెస్క్: రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ సంచలన నిర్ణయాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇందులో భాగంగా అమెరికా రక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ట్రంప్ వివిధ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు మరో 7 దేశాలపై యూఎస్ ట్రావెల్ బ్యాన్ విధించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, తాజాగా మరో 7 దేశాలపై యూఎస్ ట్రావెల్ బ్యాన్ విధించగా.. ఈ దేశాల సంఖ్య 12 నుంచి 19కి చేరుకుంది. జాతీయ భద్రత, ఇతర కారణాలను చూపుతూ ట్రంప్ ప్రభుత్వం ఈ దేశాల నుంచి అమెరికాలోకి ప్రయాణాన్ని పూర్తిగా నిషేధించింది.
తాత్కాలిక నిషేధ జాబితాలో 15 దేశాలు
పూర్తి ప్రయాణ నిషేధం లో ఉన్న 19 దేశాలతో పాటు, అమెరికా విధించిన తాత్కాలిక నిషేధ జాబితాలో కూడా మరో 15 దేశాలు చేరాయి. ఈ నిషేధాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆయా దేశాలతో అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ట్రంప్ పరిపాలన తీసుకున్న ఈ నిర్ణయం, ఆయా దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించే అవకాశాలను పూర్తిగా నిలిపివేసింది. తాత్కాలికంగా పరిమితం చేసింది. దీంతో వివిధ ఉద్యోగాల రీత్యా అమెరికా వెళ్లాలనుకునే ఇతర దేశాల ప్రజల కలలను ట్రంప్ నిర్ణయం ఆవిరి చేసింది.
- Tags
- Trump






