ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభంతో ఆందోళనలు.. ట్రంప్ కీలక ప్రకటన

by Ajay Maddhiboyina |

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం పెరిగింపోయింది. క‌రెన్సీ రియాద్ విలువ ప‌డిపోవ‌డం, ధ‌ర‌లు ఆకాశాన్ని తాక‌డంతో ప్ర‌జ‌లు రోడ్ల‌పై విచ్చి నిర‌స‌న చేప‌డుతున్నారు.

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభంతో ఆందోళనలు.. ట్రంప్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం పెరిగింపోయింది. క‌రెన్సీ రియాద్ విలువ ప‌డిపోవ‌డం, ధ‌ర‌లు ఆకాశాన్ని తాక‌డంతో ప్ర‌జ‌లు రోడ్ల‌పై విచ్చి నిర‌స‌న చేప‌డుతున్నారు. ఇరాన్ సుప్రీం నేత ఖ‌మేనీకి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌కారులు ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. దీంతో భద్ర‌తా బ‌ల‌గాలు నిర‌స‌న‌కారుల‌పై కాల్పులు జ‌ర‌ప‌గా ఘ‌ర్ష‌ణ‌లు తీవ్ర‌త‌రం అయ్యాయి. ఈ క్ర‌మంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌న ప్ర‌క‌ట‌న చేశారు. నిరస‌న‌కారుల‌పై కాల్పులు జ‌ర‌ప‌వ‌ద్ద‌ని వారిని రక్షించడానికి అమెరికా సిద్ధంగా ఉంద‌ని హెచ్చ‌రించారు.

దీంతో ఇరాన్ ఐక్య‌రాజ్య‌సమితి రాయ‌బారి అమీర్ స‌యీద్ ఇరావాని ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్, భ‌ద్ర‌తా మండ‌లి అధ్య‌క్షుడికి లేక రాశారు. దేశంలో ఆందోళ‌న‌లు కొన‌సాగుతుంటే ట్రంప్ చ‌ట్ట‌విరుద్ద‌మైన బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని వాటిని ఖండించాల‌ని పేర్కొన్నారు. బాహ్య ఒత్తిడి లేదా సైనిక జోక్యానికి సాకుగా పెట్టుకుని దేశంలో అశాంతిని ప్రేరేపించ‌డం ఇరాన్ యెక్క సార్వ‌భౌమాధికారం, రాజకీయ స్వాతంత్య్రం మ‌రియు ప్ర‌దేశిక స‌మ‌గ్ర‌త‌ను ఉల్ల‌గించ‌డ‌మే అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇరాన్ లేఖ‌పై ఐక్య‌రాజ్య‌స‌మితి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story