- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Too Late ‘చర్చలకు సమయం మించిపోయింది’ ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాతో చర్చలకు సిద్ధమని ఇరాన్ అంటోందని, కానీ ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు ఇప్పుడు సమయం మించిపోయిందని (Too Late) ఆయన స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సైనిక శక్తి పూర్తిగా చిన్నాభిన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, వైమానిక దళం, నౌకాదళంతో పాటు ఆ దేశ నాయకత్వం కూడా తుడిచిపెట్టుకుపోయిందని ట్రంప్ మంగళవారం తన 'ట్రూత్ సోషల్ మీడియా' వేదికగా ప్రకటించారు.
ఒబామా డీల్‌పై విమర్శలు..
ఇరాన్ తన బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్ ద్వారా అణు ఆయుధాల తయారీని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. లాంగ్ రేంజ్ మిస్సైళ్లు, అణుబాంబులు ఉన్న ఇరాన్.. మిడిల్‌ఈస్ట్‌కే కాకుండా అమెరికాకు కూడా పెను ముప్పు అని ట్రంప్ హెచ్చరించారు. గతంలో బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఇరాన్ అణు ఒప్పందాన్ని తాను రద్దు చేయడం గర్వకారణంగా భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆ ఒప్పందం ఉండి ఉంటే మూడేళ్ల క్రితమే ఇరాన్ అణుబాంబులను ప్రయోగించేదని ఆయన అభిప్రాయపడ్డారు.






