- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాషింగ్టన్ డీసీలో కలకలం.. 'టైటానిక్' ఫోజులో ట్రంప్ - ఎప్‌స్టీన్ విగ్రహం!
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ ప్రాంతంలో బుధవారం ఒక వింత దృశ్యం ప్రత్యక్షమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ ప్రాంతంలో బుధవారం ఒక వింత దృశ్యం ప్రత్యక్షమైంది. ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రం 'టైటానిక్'లోని ఐకానిక్ ఫోజును గుర్తుకు తెచ్చేలా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దివంగత లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్ కలిసి ఉన్న ఒక భారీ విగ్రహం అక్కడ వెలిసింది. రాత్రికి రాత్రే ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అజ్ఞాత వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం కలకలం రేపటడంతో పాటు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కళాఖండం వెనుక ఉన్న ఉద్దేశం
దాదాపు 12 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహానికి బంగారు రంగు (Spray-painted gold) వేయబడింది. టైటానిక్ సినిమాలో జాక్, రోజ్ షిప్ ముందు భాగంలో నిలబడినట్లే, ఇక్కడ ఎప్‌స్టీన్ ముందుండగా ట్రంప్ వెనుక నుండి పట్టుకున్నట్లుగా ఉంది. ఈ విగ్రహం కింద ఉన్న ఫలకాలపై రాసిన వాక్యాలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. ‘జాక్, రోజ్ మధ్య విషాద ప్రేమకథ విలాసవంతమైన ప్రయాణాలు, పార్టీలు, రహస్య నగ్న చిత్రాల (Nude sketches) మీద ఆధారపడి ఉంటే.. ఈ విగ్రహం ట్రంప్, ఎప్‌స్టీన్ మధ్య ఉన్న అటువంటి బంధాన్నే గుర్తు చేస్తోంది’ అని రాసి ఉంది.
ఎవరీ 'సీక్రెట్ హ్యాండ్‌షేక్'?
కేవలం విగ్రహమే కాకుండా, క్యాపిటల్ హిల్ మార్గంలో పది బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. వాటిపై ట్రంప్, ఎప్‌స్టీన్ కలిసి ఉన్న ఫోటోలతో పాటు ‘మేక్ అమెరికా సేఫ్ ఎగైన్’ అనే నినాదం రాసి ఉంది. ఈ విగ్రహం ఏర్పాటు వెనుక 'సీక్రెట్ హ్యాండ్‌షేక్' అనే అజ్ఞాత కళాకారుల బృందం ఉన్నట్లు భావిస్తున్నారు. రాజకీయ అంశాలపై వ్యంగ్యంగా స్పందించే ఈ బృందం, గత ఏడాది సెప్టెంబర్‌లో కూడా ట్రంప్, ఎఎప్‌స్టీన్ చేతులు పట్టుకున్నట్లు ఉన్న విగ్రహాన్ని క్యాపిటల్ బయట ఉంచింది. తర్వాత అధికారులు దాన్ని వెంటనే తొలగించారు.






