లాటిన్ అమెరికాలో యుద్ధ వాతావరణం.. వెనిజులా అధ్యక్షుడు, అతని భార్యను అదుపులోకి తీసుకున్న యూఎస్

by Malleboina Mahesh |   (  Updated:2026-01-03 09:58:41  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. యూఎస్ అదుపులో వెనిజులా అధ్యక్షుడు, అతని భార్య ఉన్నట్లు ట్రంప్ తెలిపారు.

లాటిన్ అమెరికాలో యుద్ధ వాతావరణం.. వెనిజులా అధ్యక్షుడు, అతని భార్యను అదుపులోకి తీసుకున్న యూఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. లాటిన్ అమెరికాలో యుద్ధ వాతావరణం (War atmosphere) నెలకొన్న క్రమంలో ఈ రోజు ఉదయం అమెరికా వైమానిక దళాలు వెనిజులా రాజధాని కరాకస్‌పై మెరుపు దాడులు చేశాయి. కరాకస్‌లోని లా కార్లోటా ఎయిర్ బేస్, ఫ్యూర్టే టియునా సైనిక స్థావరాలతో పాటు పలు కీలక ప్రాంతాల్లో కనీసం ఏడు భారీ పేలుళ్లు సంభవించాయి. వెనిజులా అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా (Donald Trump)కు కేంద్రంగా మారిందని, అక్కడి నుంచే అమెరికాలోకి మాదకద్రవ్యాల సరఫరా అవుతున్నాయని ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ దాడుల నేపథ్యంలో వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.

మరో కీలక పరిణామంలో, వెనిజులా అధ్యక్షుడు నికొలస్ (Venezuelan President Nicolas) మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా ప్రత్యేక దళాలు (US special forces) అదుపులోకి తీసుకున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. "అమెరికా సైన్యం వెనిజులాపై భారీ స్థాయి దాడులను విజయవంతంగా పూర్తి చేసింది. మదురో దంపతులను పట్టుకుని వెనిజులా వెలుపలకు తరలించాం" అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నార్కో-టెర్రరిజం (డ్రగ్స్ అక్రమ రవాణా) ఆరోపణల నేపథ్యంలో ఈ 'హైబ్రిడ్ ఆపరేషన్' చేపట్టినట్లు తెలుస్తోంది. గత 36 ఏళ్లలో ఒక దేశాధ్యక్షుడిని అమెరికా దళాలు నేరుగా పట్టుకోవడం ఇదే మొదటిసారి కావడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

Next Story