- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనాలో విషాదం: కొండ చరియలు విరిగి పడి 47 మంది మృతి
by samatah |
పర్వత ప్రాంతాలైన నైరుతి చైనాలోని యునాన్ ప్రావీన్సులో కొండ చరియలు విరిగిపడి 47 మంది మృతి చెందారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: చైనాలో విషాదం చోటు చేసుకుంది. పర్వత ప్రాంతాలైన నైరుతి చైనాలోని యునాన్ ప్రావీన్సులో కొండ చరియలు విరిగిపడి 47 మంది మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న రెస్క్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మంచు భారీగా కురుస్తుండటంతో స్థానికంగా 200 ఇళ్లను ఖాళీ చేయించారు. సుమారు 18 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. మృత దేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ నిర్వహిస్తున్నట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే కొండ చరియలు విరిగిపడటానికి గల కారణాలను వెల్లడించలేదు. గత వారం వాయువ్య చైనాలోని ఒక మారుమూల స్కీయింగ్ ప్రాంతం నుంచి పర్యాటకులను అధికారులు ఖాళీ చేయించారు. అయితే తరచుగా వర్షం, నిర్మాణ పనుల వల్ల చైనాలో తరచుగా కొండచరియలు విరిగి పడుతుంటాయి. గతేడాది సైతం ఇదే తరహా ఘటన జరగడంతో సుమారు 70 మంది చనిపోయారు.
Next Story






