Ukraine అభ్య‌ర్థ‌న తోసిపుచ్చిన అమెరికా.. 'మరీ ఓవ‌ర్‌గా ఉంది!'

by Disha Web Desk 20 |
Ukraine అభ్య‌ర్థ‌న తోసిపుచ్చిన అమెరికా.. మరీ ఓవ‌ర్‌గా ఉంది!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః గ‌త ఆరు నెల‌ల‌లుగా కొన‌సాగుతున్న ఉక్రెయిన్‌లో యుద్ధం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇన్నాళ్లూ అంత‌ర్జాతీయంగా ప‌లు దేశాల స‌హ‌కారంతో ర‌ష్యాను ఎదుర్కోవ‌డంలో ఉక్రెయిన్ ఎక్క‌డా త‌లొగ్గ‌లేదు. అయితే, ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించాల‌ని అమెరికాపై ఉక్రెయిన్ వ‌త్తిడి తెస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో తాగా రష్యన్‌లపై 'బ్లాంకెట్ వీసా' నిషేధాన్ని విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అమెరికాను అభ్యర్థించాడు. కాగా, ఈ అభ్య‌ర్థ‌న‌ను యునైటెడ్ స్టేట్స్ తిరస్కరించింది. బ్లాంకెట్‌ నిషేధం విధిస్తే, "అసమ్మతివాదులు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గురయ్యే వ్యక్తులకు" అందాల్సిన‌ అవకాశాలు ఉండ‌వ‌ని పేర్కొంది.

దీనికి ముందు, ఈ వీసాను నిషేధించ‌డం ద్వారా రష్యా పౌరులు ఎవరైనా దేశంలోకి ప్రవేశించకుండా ఆపాలని ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీ US ప్రభుత్వాన్ని కోరారు. వాషింగ్టన్ పోస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రష్యన్లు "తమ తత్వాన్ని మార్చుకునే వరకు వారి స్వంత ప్రపంచంలోనే జీవించాల్సిన అవసరం ఉందని" అన్నారు. అయితే, అవ‌స‌ర‌మైన‌ప్పుడు తాము ఎలాంటి నిషేధాన్ని విధించ‌డానికైనా సిద్ధ‌మ‌ని వైట్ హౌస్ సోమవారం స్పష్టం చేసింది. అమెరికా ఇప్పటికే కీలకమైన క్రెమ్లిన్ అధికారులపై ఆంక్ష‌లు విధించింద‌ని, కొనసాగుతున్న పోరాటంలో ఉక్రెయిన్‌కు సహాయం చేస్తూనే ఉంటుందని యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి అధికారిక ప్రకటనలో తెలిపారు.


Next Story

Most Viewed