ఎటు చూసిన శిథిలాలే.. ఉక్రెయిన్‌లో కలిచివేసే దృశ్యాలు

by Disha Web Desk 4 |
ఎటు చూసిన శిథిలాలే.. ఉక్రెయిన్‌లో కలిచివేసే దృశ్యాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఏడాదిగా కొనసాగుతన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ చేసిన ఓ ట్వీట్ ఆ దేశంలో జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపింది. తాజాగా డొనెట్స్ ప్రాంతంలోని ఓ పట్టణం ఏ స్థాయిలో ధంసమైందో తెలియజేస్తూ డ్రోన్ దృశ్యాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంది. డొనెట్స్క్ లోని మరింక అనే నగరం దృశ్యాలు భీతిగొల్పేలా ఉన్నాయి.

కనుచూపు మేరలో భూమి కాలిబూడిద కాగా భవనాలు నేల మట్టమయ్యాయి. గంతో దాదాపు 10వేల మంది నివాసం ఉన్న ఈ నగరంలో ఇప్పుడు ఎవరూ లేరు. ఇళ్లు పూర్తిగా శిథిలమైపోయాయి. ఈ నగరంపై తొలుగ డాన్ బాస్ వేర్పాటు వాదులు దాడి చేసి ఆధీనంలోకి తీసుకున్నారు. కానీ నాలుగు నెలల తర్వాత ఉక్రెయిన్ తిరిగి దీన్ని స్వాధీనం చేసుకుంది. ఈ పోరాటాల దెబ్బకు నగరం మొత్తం భయానకంగా మారింది. పరిస్థితులు చూస్తే అక్కడ మనుషులు జీవించడానికి అవకాశం లేకుండా పోయినట్లు కనిపిస్తుంది.


Next Story

Most Viewed