Port Sudan plane crash : కుప్పకూలిన విమానం.. తొమ్మిది మంది దుర్మరణం

by Disha Web Desk 9 |
Port Sudan plane crash : కుప్పకూలిన విమానం.. తొమ్మిది మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: విమానం కుప్పకూలి నలుగురు సైనిక సిబ్బందితో పాటు తొమ్మిదిమంది మ‌ృతిచెందిన ఘోరమైన ఘటన పోర్ట్ సుడాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ‘టేకాఫ్ టైంలో సాంకేతిక లోపం కారణంగానే విమానం అదుపుతప్పి, మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళం సాయంతో ఫ్లైట్‌లోని మంటలను ఆర్పేశామని, ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది చనిపోయారని సుడాన్ ఆర్మీ ఆఫీసర్లు వెల్లడించారు. విమానం కూలిపోయిందన్న సమాచారం అందుకున్న ప్రయాణికుల బంధువులు పెద్దఎత్తున్న ఎయిర్‌పోర్ట్ వద్దకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన ప్రయాణికుల పేర్లు ఇంకా తెలియరాలేదు. కాగా, ప్రమాదానికి గల కారణాలను కనుగొంటామని, విమానం శిథిలాలను కూడా సేకరిస్తామని’’ అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed