అంగన్‌వాడీ ఉద్యోగాలకు డిగ్రీ క్వాలిఫికేషన్ .. ప్రభుత్వం సంచలన నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-23 14:24:12  IST  )

అంగన్‌వాడీ ఉద్యోగాలకు డిగ్రీ క్వాలిఫికేషన్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..

అంగన్‌వాడీ ఉద్యోగాలకు డిగ్రీ క్వాలిఫికేషన్ .. ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: బాల బాలికలు, గర్భవతులకు సంపూర్ణ ఆహారం అందించేందుకు కేంద్రప్రభుత్వం(Central Government) అంగన్ వాడీ(Anganvadi) వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల ఆధ్వర్యంలో అంగన్ వాడీ కేంద్రాలు దేశంలో కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా పెరుగుతున్న జనాభా కారణంగా అంగన్ వాడీ కేంద్రాలు సైతం పెంచబడుతున్నాయి. దీంతో అంగన్ వాడీ టీచర్ల, వారి సహాయకుల పోస్టులను కూడా పెంచాల్సి వస్తోంది. ఈ పోస్టులకు ఇప్పటివరకు ఇంటర్ కంటే తక్కువ అర్హత ఉన్నవాళ్లకు కేటాయిస్తున్నారు.

తాజాగా అంగన్ వాడీ వర్కర్ల అర్హతల విషయంలో ఒడిశా ప్రభుత్వం(Odisha Government)సంచలన సవరణ చేసింది. వర్కర్ల అర్హతను డిగ్రీ(Graduation)కి మార్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం మోహన్ చరణ్ మాఝీ(Chief Minister Mohan Charan Majhi) నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంగన్‌వాడీ కార్యకర్తలుగా జూనియర్ గ్రేడ్ సర్వీస్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలని నిర్ణయించారు.

అయితే ఈ సవరణ ప్రస్తుతం పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు వర్తించదని కేబినెట్ స్పష్టం చేసింది. మునుపటి నిబంధనల ప్రకారం నిర్ణయించిన అర్హతల ప్రకారమే వారందరూ కొనసాగుతారని వెల్లడంచింది. కొత్త నియమాకాలకు డిగ్రీ క్వాలిఫికేషన్ తప్పసరి చేసినట్లు ప్రకటించింది.

కాగా ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ ప్రోగ్రామ్ ద్వారా ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, కౌమారదశలో ఉన్న బాలికలకు అవసరమైన ఆరోగ్యం, పోషకాహారం, విద్యా సేవలను అందించే బాధ్యతలను అంగన్‌వాడీ కార్యకర్తలు(Anganwadi workers) చూస్తున్నారు. మరి ఈ సవరణ నిర్ణయంపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Next Story