- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పృహ కోల్పోయిన మహిళకు సీపీఆర్ చేసి బతికించిన టీచర్.. బ్యాడ్‌గా టచ్ చేశాడని దాడి..
మంచికి పోతే చెడు ఎదురైనట్లు.. ప్రాణాలు కాపాడిన ఉపాధ్యాయుడిని సత్కరించాల్సింది పోయి ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. ప్రశంసలకు బదులు విమర్శలు వెల్లువెత్తాయి. చైనాలోని హెంగ్‌యాంగ్‌లో జూలై 12న ఒక మహిళ వీధిలో స్పృహ కోల్పోయి కుప్పకూలింది.

దిశ, వెబ్ డెస్క్ : మంచికి పోతే చెడు ఎదురైనట్లు.. ప్రాణాలు కాపాడిన ఉపాధ్యాయుడిని సత్కరించాల్సింది పోయి ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. ప్రశంసలకు బదులు విమర్శలు వెల్లువెత్తాయి. చైనాలోని హెంగ్‌యాంగ్‌లో జూలై 12న ఒక మహిళ వీధిలో స్పృహ కోల్పోయి కుప్పకూలింది. దీంతో 42 ఏళ్ల ఉపాధ్యాయుడు పాన్, CPR శిక్షణ పొందిన మెడికల్ స్కూల్ లెక్చరర్.. ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఓ మహిళా డాక్టర్‌తో కలిసి.. చాతీని నొక్కుతూ CPR చేశారు. ఫలితంగా ఆమె బలహీనమైన పల్స్‌తో స్పృహలోకి వచ్చింది. ఆసుపత్రికి తరలించబడింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది. కానీ ఈ వీడియో వైరల్ అయ్యాక.. టీచర్ సీపీఆర్ చేయడంలో తప్పులు వెతికే పనిలో పడ్డారు కొందరు జనాలు. టీచర్ ఛాతీ మీద తన చేతులు స్థానాన్ని తప్పుబట్టారు. అది అనుచితమని.. మహిళ డాక్టరే CPR చేసి ఉండాలని సోషల్ మీడియాలో దాడి చేయడం మొదలపెట్టారు.
పాన్ తన చర్యలను సమర్థించుకుంటూ.. తాను CPR శిక్షణలో నేర్చుకున్న విధంగా స్త్రీ రొమ్ము ఎముకపై చేతులు ఉంచానని.. సంఘటన సమయంలో ఎవరూ తన టెక్నిక్‌ను తప్పుగా చెప్పలేదని అన్నారు. ఈ ఆరోపణలపై అతను తీవ్ర నిరాశ, భయాన్ని వ్యక్తం చేశాడు. ఇలా తిట్టబడతానని తెలిసి ఉంటే.. సహాయం చేసేందుకు ముందుకు రాకపోయేవాడినని అన్నారు. స్థానిక ఉపాధ్యాయుల సంస్థ దర్యాప్తు చేసినప్పటికీజజ ఎటువంటి అధికారిక ఆరోపణలు నమోదు చేయలేదు. సాక్షి డెంగ్.. పాన్‌కు మద్దతుగా.. ఆ సమయంలో ప్రాణం కాపాడడమే ముఖ్యమని.. అది అనుచిత ప్రవర్తన కాదని స్పష్టం చేశారు. ఈ ఇన్సిడెంట్ భారీ ఎత్తున చర్చకు దారితీయగా.. CPRపై మెరుగైన అవగాహన, కాపాడేవారికి చట్టపరమైన రక్షణ అవసరమని సూచించారు కొందరు నెటిజన్లు.






