- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి
నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక ప్రధాని(Nepal PM) ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. సుశీల కర్కి(Sushil Karki)ను నేపాల్ తాత్కాలిక ప్రధానిగా జన్‌జడ్ ఉద్యమకారులు ఎంపిక చేశారు. జెన్-Z నిరసనకారులు ప్రతిపాదించిన సుశీల కర్కి పేరునే ఖరారు చేశారు. దీంతో నేపాల్ పార్లమెంట్‌ను అధ్యక్షుడు రద్దు చేశారు. కాసేపట్లో ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతంలో నేపాల్ ప్రధాన న్యాయమూర్తిగా సుశీల కర్కి పనిచేశారు. కాగా, ప్రభుత్వ నేతల అవినీతి కారణంగా నేపాల్‌లో భారీ స్థాయిలో హింస చెలరేగింది. పెద్ద ఎత్తున యువత రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలియజేశారు. తీవ్ర హింసాత్మక ఘటనలు జరగడంతో ప్రధాని కేపీ శర్మ ఓలి సహా, పలువురు మంత్రులు రాజీనామాలు చేశారు. దీంతో ఆందోళనకారులు కాస్త శాంతించారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఎన్నుకున్నారు.






