- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందీ మాట్లాడటం నేరం కాదు.. ప్రాథమిక స్కూళ్లలో పెట్టడమే వ్యతిరేకిస్తున్నాం: సంజయ్ రౌత్
1 వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని మూడో భాషగా మార్చాలనే నిర్ణయాన్ని శివసేన (యూబీటీ) నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది

దిశ, నేషనల్ బ్యూరో: 1 వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని మూడో భాషగా చేర్చాలనే నిర్ణయాన్ని శివసేన (యూబీటీ) నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో విడిపోయిన బంధువులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం శివసేన (యూబీటీ) కి చెందిన నేత సంజయ్ రౌత్ తమిళనాడు సీఎం స్టాలిన్ పై విమర్శలు చేశారు. హిందీకి తాము వ్యతిరేకం కాదని, ప్రాథమిక పాఠశాలల్లో ఆ భాషను బలవంతంగా చేర్చడంపైనే విముఖత వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. హిందీ మాట్లాడకూడదు, మాట్లాడనివ్వకూడదు అనేది తమ భావన కాదని అన్నారు. మహారాష్ట్రలో మేము అనుసరించే ధోరణి అది కాదు. మేము హిందీ మాట్లాడతాం. కానీ ప్రాథమిక విద్యా స్థాయిలో హిందీని బలవంతంగా చేరుస్తామంటే మేము సహించం అని అన్నారు. మా పోరాటం అంతవరకే పరిమితం అని అన్నారు.
తుపానులా ఉద్యమం
తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్ లో పోస్టు చేస్తూ తమిళనాడులో ఏళ్ల తరబడి చేస్తున్న ఉద్యమం ఇప్పుడు మహారాష్ట్రకు కూడా చేరింది. అక్కడ ఉద్దవ్, రాజ్ ఠాక్రే చేసిన ర్యాలీ ఎంతగానో ఆకట్టుకుంది. హిందీపై వారి పోరాటం గొప్పదని అన్నారు. మహారాష్ట్రలో ఈ ఉద్యమం తుఫానులాగా సాగుతుందని అన్నారు. హిందీ విధింపునకు వ్యతిరేకంగా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ‘ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆయన ఇచ్చిన ఉద్వేగపూరితమైన, శక్తివంతమైన ప్రసంగం అపారమైన ఉత్సాహాన్ని ఇచ్చిందని ’ స్టాలిన్ ప్రకటించారు






