- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్ట్రేలియాలో అమల్లోకి వచ్చిన సోషల్ మీడియా నిషేధం
ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలో సోషల్ మీడియా వాడకంపై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలో సోషల్ మీడియా వాడకంపై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకాన్ని నిషేధిస్తూ.. ఆ దేశంలో జీవో తీసుకొచ్చింది. చిన్నారులను అడిక్టివ్ స్క్రీన్ టైమ్, హానికరమైన కంటెంట్ నుంచి రక్షించే లక్ష్యంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ దేశంలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ (Facebook, Instagram, TikTok వంటి ప్లాట్‌ఫామ్‌లలో) అధికారికంగా నిషేధించింది. ఈ నిర్ణయం ద్వారా యువతను సోషల్ మీడియా వ్యసనం నుండి దూరం చేయడంతో పాటు, వారి మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది.
కాగా ఈ రూల్స్ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ చారిత్రక మార్పుపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ.. ఈ బాధ్యతను సాంకేతిక దిగ్గజాలపైకి (Tech Giants) మళ్లించడం, కుటుంబాలకు కొంత ఉపశమనం ఇవ్వడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ కొత్త చట్టం ద్వారా, యువత భద్రతపై మరింత దృష్టి సారించి, సోషల్ మీడియా సంస్థలు కఠినమైన వయస్సు ధృవీకరణ నిబంధనలను పాటించేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.






