- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్ధరామయ్యే అయిదేళ్లు సీఎంగా కొనసాగుతారు: కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేస్తారని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే సోమవారం స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే సోమవారం స్పష్టం చేశారు. ఇటీవల అధికార పక్షం నుంచే అత్యధిక అవినీతి, ఆరోపణలు, ‘పాలన వైఫల్యం’ అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. 2023 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరి మధ్య పోటీ జరిగినా, చివరికి సిద్ధరామయ్యకి సీఎం పదవి లభించింది. అయితే అప్పటి నుంచి ఇద్దరి మధ్య సఖ్యత లోపించిందని ప్రచారం జరుగుతోంది.
సమర్థవంతంగా కలిసి పని చేస్తున్నాం
నాయకత్వ మార్పు గురించి ఎలాంటి ప్రతిపాదన లేదు. చర్చ కూడా జరగలేదు. ఈ విషయం శాసన సభ్యుల సమావేశంలో ఎప్పుడూ చర్చకు రాలేదు. ఎవరూ కూడా చెప్పలేదు. మేమంతా ఐక్యంగా, సమర్థవంతంగా పనిచేస్తున్నాం అని ఆర్వీ దేశ్‌పాండే స్పష్టం చేశారు. అయితే ఈ మధ్య రాజీవ్ హౌసింగ్ సొసైటీలో భాగంగా అవినీతి జరిగిందని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం, డీకే శివకుమార్ కు సంబంధించిన ఎమ్మెల్యే లు సిద్ధరామయ్యను తొలగించి డీకే శివకుమార్ ను సీఎంగా ప్రకటిస్తారని చెప్పడంతో అందరిలో ఉత్కంఠ పెరిగిపోయింది. ఇవన్నీ పుకార్లే అని సీనియర్ నేత తెలపడంతో ప్రస్తుతానికి అంతా సద్ధుమణిగినట్లే కనిపిస్తోంది.






