పాక్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్!: ప్రభుత్వ ఏర్పాటుకు పీఎంఎల్ఎన్, పీపీపీల మధ్య ఒప్పందం

by Dishanational2 |
పాక్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్!: ప్రభుత్వ ఏర్పాటుకు పీఎంఎల్ఎన్, పీపీపీల మధ్య ఒప్పందం
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్ ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)ల మధ్య సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు పాక్ ప్రధానిగా పీఎంఎల్ఎన్ చీఫ్ హెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టనున్నట్టు పీపీపీ చీఫ్ బిలావల్ భుట్టో ప్రకటించారు. ఇరు పార్టీల సీనియర్ నాయకులు మంగళవారం అర్ధరాత్రి భేటీ అయ్యారని, ఈ సమావేశంలోనే ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అలాగే పాక్ అధ్యక్షుడిగా భుట్టో తండ్రి ఆసిఫ్ జర్దారీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల జరిగిన ఆ దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ఈ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. ఇరు పార్టీల మధ్య సుధీర్ఘ చర్చల అనంతరం ఈ ఒప్పదం కుదరడం గమనార్హం. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. కాగా, సంకీర్ణ ప్రభుత్వంలో (75), పీపీపీ (54 ), ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం-పీ )(17) పార్టీలు ప్రధాన భాగస్వాములుగా ఉండనున్నాయి. అంతకుముందు పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) మద్దతు గల స్వతంత్ర్య అభ్యర్థులు 93సీట్లు గెలుచుకున్నప్పటికీ తాము ప్రతిపక్షంలోనే ఉంటామని వెల్లడించిన విషయం తెలిసిందే.

Next Story