- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచలనం.. ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు ఊహించని షాక్ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), ఆయన భార్య బుష్రా బీబీలకు ఊహించని షాక్ తగిలింది. తోషాఖానా-2 కేసులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ప్రత్యేక కోర్టు శనివారం వారికి 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021 మే నెలలో సౌదీ యువరాజు బహుమతిగా ఇచ్చిన అత్యంత ఖరీదైన 'బుల్గారీ జ్యువెలరీ సెట్'ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చాలా తక్కువ ధరకు సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఈ కేసులో రుజువయ్యాయి. రావల్పిండిలోని అడియాలా జైలులో జరిగిన విచారణ అనంతరం స్పెషల్ జడ్జ్ షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే జైలులో ఉండగా, ఈ తాజా శిక్ష ఆయన రాజకీయ భవిష్యత్తుపై మరింత ప్రభావం చూపనుంది.
జైలు శిక్షతో పాటు, కోర్టు ఈ దంపతులిద్దరికీ కలిపి 1.64 కోట్ల పాకిస్థానీ రూపాయల (PKR 16.4 million) భారీ జరిమానాను కూడా విధించింది. నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనల్లో లభించే ఖరీదైన బహుమతులను తోషాఖానా (ప్రభుత్వ ఖజానా)లో జమ చేయాల్సి ఉండగా, వాటి విలువను తక్కువ చేసి చూపడం ద్వారా ప్రభుత్వానికి భారీ నష్టం చేకూర్చారని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ తరపు న్యాయవాదులు పైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంది. ఈ పరిణామంతో పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.






