- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్, పాక్ మధ్య కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. తాము మీవెంటే అంటూ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ప్రకటన
ఇండియా(India), పాకిస్తాన్(Pakistan) దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్(Putin) కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా(India), పాకిస్తాన్(Pakistan) దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్(Putin) కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం(Pahalgam)లో ఉగ్రదాడి(Terrorist Attack)లో మృతిచెందిన వారికి సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదులనే కాకుండా.. వారికి మద్దతు ఇచ్చిన వారిని కూడా చట్టప్రకారం శిక్షించాలని అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ప్రధాని మోడీ రష్యా విక్టరీ డే శుభాకాంక్షలు చెప్పారు.
మరోవైపు పెహల్గాం ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాత ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేల మందిని విచారించగా, దాదాపు వందమందిపై కేసు నమోదు చేశారు. ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది. వీరిలో చాలామందిని ఇప్పటికే అరెస్టు చేశారు. మిగిలినవారు నిఘా నీడలో ఉన్నారు.






