నేపాల్‌లో కొనసాగుతున్న అల్లర్లు.. 31కి చేరిన మృతుల సంఖ్య

by Malleboina Mahesh |

భారత్ కు సమీప దేశం అయిన నేపాల్ లో అవినీతి వ్యతిరేక ఉద్యమం తారా స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిన ప్రభుత్వం దేశవ్యాప్తంగా 27 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లను బ్యాన్ చేసింది.

నేపాల్‌లో కొనసాగుతున్న అల్లర్లు.. 31కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: భారత్‌కు సమీప దేశం అయిన నేపాల్‌లో అవినీతి వ్యతిరేక ఉద్యమం (Anti-Corruption Movement) తారా స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిన ప్రభుత్వం దేశవ్యాప్తంగా 27 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లను బ్యాన్ చేసింది. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన యువత ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పార్లమెంట్ భవన్ లోకి దూసుకెళ్లి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అలాగే పార్లమెంట్ భవన్ కు నిప్పుపెట్టారు. అనంతరం మంత్రులు, రాజకీయ నేతల నివాసాలే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. అయితే నిరసనలు తీవ్ర తరం కావడంతో స్థానిక ప్రభుత్వం సైనిక చర్యలతో పాటు కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో “జెన్ Z” నిరసనకారుల (“Gen Z” protesters)పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొదట 19 మంది మృతి చెందగా 250 మంది వరకు యువకులు గాయపడ్డారు.

దీంతో నేపాల్ ప్రధాని, అధ్యక్షుడు, మంత్రులు రాజీనామా చేసినప్పటికి నిరసనలు తగ్గలేదు. దీంతో గత మూడు రోజులుగా నేపాల్ (Nepal) లోని కీలక పట్టణాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో “జెన్ Z” నిరసనల కారణంగా తీవ్రమై మరణాల సంఖ్య 31కి చేరుకుంది (death toll has reached 31). ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా గాయపడగా.. 25 మంది మృతదేహాలను గుర్తించారు. మిగతా ఆరుగురి వివరాలు ఇంకా తెలియరాలేదు. నేపాల్ రాజధాని సహా అనేక ప్రాంతాల్లో అగ్ని దహనాలు, పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి రాజీనామా (Resignation of Prime Minister) చేయగా, ప్రస్తుతం ఇంటరిమ్ ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు కొనసాగుతున్నాయి. నిరసనకారులు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుషీలా కార్కీ పేరును ముందుకు తెచ్చారు. మరోవైపు కాఠ్మాండు మేయర్ బలేంద్ర షాకూ యువతలో విస్తృత మద్దతు ఉండటంతో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆఖరికి ఈ చర్చల ఫలితంగా ఎవరికి నాయకత్వం లభిస్తుందో అనేది త్వరలోనే స్పష్టమవుతుంది.

Next Story