- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iran : ఇరాన్‌లో ఏదో జరగబోతోంది.. పశ్చిమాసియా దేశాల్లో రెడ్ అలర్ట్
ఇజ్రాయెల్-ఇరాన్(Iran-Israel War) మధ్య యుద్ధం రాజుకోవడంతో ఇరాన్ తో సహా పశ్చిమాసియా దేశాల్లో(West Asian Countries) రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్-ఇరాన్(Iran-Israel War) మధ్య యుద్ధం రాజుకోవడంతో ఇరాన్ తో సహా పశ్చిమాసియా దేశాల్లో(West Asian Countries) రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించారు. ఇరాన్, ఇరాక్, లెబనాన్, జోర్డాన్ లాంటి దేశాల్లో గగనతలం మూసివేసి, అన్ని ఎయిర్‌పోర్టులు బంద్ చేయడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అన్ని విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఈ ఉద్రిక్తతల నడుమ కెనడాలో జరుగుతున్న జీ-7 సమావేశం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్థాంతరంగా మధ్యలోనే బయల్దేరి అమెరికా వెళ్లిపోయారు. టెహ్రాన్‌లోని ప్రజలు వెంటనే నగరాన్ని ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈ పర్యవసానాల నేపథ్యంలో ఇరాన్‌లో ఏ క్షణంలోనైనా పెద్ద దాడి జరగొచ్చనే వదంతులతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. టెహ్రాన్‌లోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు, వెంటనే నగరాన్ని వదిలి ఆర్మేనియా సరిహద్దు ద్వారా స్వదేశానికి రావాలని ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొందరు భారతీయులు అఫ్ఘనిస్తాన్ మీదుగా ఇండియాకు చేరుకుంటున్నారు. అయితే ఇరాన్ లో గల నంతాజ్, ఫార్దో అణుకేంద్రాలను అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ ధ్వంసం చేయబోతోందనే వార్తలు గుప్పుమన్నాయి.
అణుబాంబులు తయారు చేయడానికి ఇరాన్ వద్ద దాదాపు 90 శాతం శుద్ధి చేసిన యురేనియం సిద్ధంగా ఉండటంతో.. ఫార్దోలోని పర్వతం లోపాల నిర్మించిన ఈ అణుశక్తి కేంద్రాన్ని నాశనం చేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, భారీగా ఆయుధాలు పశ్చిమాసియా సరిహద్దుల్లోకి చేరుకోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.






