పీఓకే ప్రజలు మనవాళ్లే..రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

పీవోకే ప్రజలు మనవాళ్లే అంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా విడిపోయినా రాజకీయంగా ఏదో ఒకరోజు భారత్‌లో ఏదో ఒకరు ఏకమవుతారని అన్నారు.

పీఓకే ప్రజలు మనవాళ్లే..రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పీవోకే ప్రజలు మనవాళ్లే అంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా విడిపోయినా రాజకీయంగా ఏదో ఒకరోజు భారత్‌లో ఏదో ఒకరు ఏకమవుతారని అన్నారు. అక్కడ ఉన్నవారికి భారత్‌తో దృఢ‌మైన‌ సంబంధాలు ఉన్నాయ‌ని చెప్పారు. అక్క‌డ ఉన్న‌వారిలో కొంద‌రు మాత్ర‌మే త‌ప్పుదారి ప‌ట్టారని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్ ఉగ్ర‌వాద దాడుల‌కు ప్ర‌తీకారం తీర్చుకునేట‌ప్పుడు భార‌త్ ఇంకా ఎక్కువే చేయ‌గ‌లిగేద‌ని కానీ మ‌నం శ‌క్తితో పాటూ సంయ‌మ‌నం పాటించామ‌ని అన్నారు. ఆపేష‌న్ సిందూర్ ద్వారా మేక్ ఇన్ ఇండియా జాతీయ భ‌ద్ర‌త‌కు ముఖ్య‌మైన‌ద‌ని నిరూపించ‌బ‌డింద‌ని అన్నారు. భార‌త్ ఫైట‌ర్ జెట్ లేదా క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ల‌ను అభివృద్ధి చేసుకోవ‌డంతో పాటూ న్యూ ఏజ్ వార్ షేర్ టెక్నాల‌జీకి సైతం సిద్ధం అవుతోంద‌ని చెప్పారు. ఆప‌రేషన్ సిందూర్‌లో మ‌న ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థను చూసి ప్రపంచం మొత్తం షాక్ అయ్యిందని అన్నారు. ఏ శత్రువు కవచాన్ని అయినా చేధించగల శక్తి మనకు ఉందని నిరూపించామని చెప్పారు.

Next Story