- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IED blast: పోలీసుల కూంబింగ్.. ఐఈడీ పేలుడుతో జవాన్ మృతి
జార్ఖండ్-ఒడిశా సరిహద్దులోని ఒడిశాలోని రూర్కెలా సమీపంలోని కె బాలంగ్ ప్రాంతంలో శనివారం ఉదయం 5:50 గంటల సమయంలో పోలీసలు కూంబింగ్ చేస్తుండగా ఐఈడీ పేలిన ఘటనలో జవాన్ మృతిచెందాడు.

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్-ఒడిశా సరిహద్దులోని ఒడిశాలోని రూర్కెలా సమీపంలోని కె బాలంగ్ ప్రాంతంలో శనివారం ఉదయం 5:50 గంటల సమయంలో పోలీసలు కూంబింగ్ చేస్తుండగా ఐఈడీ పేలిన ఘటనలో జవాన్ మృతిచెందాడు. సారందా అడవిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉమ్మడి భద్రతా ఆపరేషన్ నిర్వహించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 134 బెటాలియన్ ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దళాలు సంయుక్తంగా ఈ నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించాయి.
రూర్కెల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
ఈ సమయంలో ఐఈడీ పేలగా ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌కు చెందిన అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) సత్యబన్ కుమార్ సింగ్ (34) కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వెంటనే రూర్కెలాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ జవాన్ సింగ్ మరణించాడు. ఈ సంఘటన తర్వాత మొత్తం ప్రాంతాన్ని హై అలర్ట్ ప్రకటించారు. అదనపు దళాలను మోహరించారు. పేలుడు జరిగిన ప్రదేశం ఒడిశాలోని కెబోలాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. నక్సల్స్ భద్రతా సిబ్బంది కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారని వారు మరిన్నిదాడులకు కుట్ర పన్నుతున్నారని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పోలీసులు అటవీ ప్రాంతాల్లో మరింత ముమ్మరంగా కూంబింగ్ చేపట్టనున్నారు.






