- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పథకం ప్రకారమే దాడి..
పహల్గామ్ ఉగ్రదాడి పక్కా పథకం ప్రకారమే జరిగింది.

కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి యాదృశ్చికంగా జరిగింది కాదని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రవాదులు ఎంచుకున్న స్థలం వాహన రాకపోకలకు అనువుగా ఉండదు. ట్రెక్కింగ్‌కు వెళ్లే యాత్రికులు మధ్యలో విశ్రాంతి తీసుకునే స్థలం. అక్కడ చాలాదూరం వరకు ఓపెన్ గ్రౌండ్ ఉండటంతో ఉగ్రవాదులు ఆ స్థలాన్ని ఎంపిక చేసుకుని ఉండవచ్చని వారు అంటున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఉగ్రవాదులు ఎంచుకున్న రోజు. ఈ రోజు అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియాలో అడుగుపెట్టిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. గతంలోనూ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇండియాకు 2000 మార్చి 19 వ తేదీన రాగా 20 వ తేదీన చిట్టాసింగ్ పురాలో 35 మంది సిక్కులను ఉగ్రవాదులు హతమార్చారు. ఇప్పుడు సైతం ప్యాటర్న్ ఎంచుకున్నారు. మరో విషయం ఉగ్రవాదులు దాడి చేసేందుకు ఎంచుకునే రోజు లేదా సమయంలో ఎక్కువమంది ఉండేలా చూసుకుంటారు. దీనివల్ల ఘటన తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వారు కోరుకునే ప్రచారం మరింత ఎక్కువగా వస్తుంది. అందువల్ల సహజంగా శని, ఆదివారాలను ఎంచుకోవాల్సి ఉండగా మంగళవారం దాడి ఎందుకు చేశారన్న ప్రశ్న చాలామందిలో వచ్చింది. నిఘా వర్గాల అభిప్రాయం ప్రకారం.. శని, ఆదివారాల్లో స్థానిక కశ్మీర ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో ఆ ప్రాంతానికి వస్తారు.. వారిని దాడి నుంచి తప్పించేందుకే వర్కింగ్ డేను ఎంచుకున్నారని సమాచారం.






