- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్థాన్‌తో అమెరికాకు ముప్పు..ఇంటెలిజెన్స్ హెచ్చరికలు !
అమెరికాకు చేరే రేంజ్ కు అణు సామర్థ్యం కలిగిన మిస్సైల్స్ తయారీకి పాకిస్తాన్ కృషి చేస్తోందని తులసి గబ్బార్డ్ సంచలన ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ యుద్ధం ప్రారంభమై 17 రోజులు పూర్తయింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో అమెరికాకు ఊహించని పరిణామం ఎదురయింది. పాకిస్తాన్ ( Pakistan) తో అమెరికాకు ముప్పు ఉన్నట్లు ఇంటలిజెన్స్ వెల్లడించింది. అమెరికాకు చేరే రేంజ్ కు అణు సామర్థ్యం కలిగిన మిస్సైల్స్ తయారీకి పాకిస్తాన్ కృషి చేస్తోందని US డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్ ( Tulsi Gabbard) సంచలన ప్రకటన చేశారు.
ఇక పాకిస్తాన్ తో పాటు ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా కూడా యాక్టివ్ గా మిస్సైల్స్ వ్యవస్థ పై పరిశోధనలు చేస్తున్నాయని వివరించారు. ఈ దేశాలతో అమెరికాకు ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చారు తులసి. ఇలాంటి నేపథ్యంలో అమెరికా కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అంటూ వ్యాఖ్యానించారు తులసి గబ్బార్డ్. ఇది ఇలా ఉండగా అటు రష్యా, చైనాలతో ఉత్తరకొరియా తన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటుందని తెలిపారు. దీంతో తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా ప్రస్తుతం తులసి గబ్బార్డ్, ట్రంప్ సర్కార్ లో ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తున్నారు.






