- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్తాన్.. సైన్యానికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటన
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రెండు దేశాలు వ్యాపార సంబంధాలు తెగదెంపులు చేసుకున్నాయి. ఉగ్రవాదులు ఎక్కడున్నా వదిలిపెట్టం, వారికి ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా అత్యంత కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోడీ(PM Modi) పరోక్షంగా పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ అప్రమత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత జవాన్‌ను బంధించి వేధిస్తోన్న పాక్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నది.
యుద్ధ వాతావరణం తలపిస్తోన్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన చేసింది. భారత్ దాడి చేస్తే తిరిగి తప్పకుండా దాడి చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. దేనికైనా సిద్ధంగా ఉండాలని సైన్యానికి ఆదేశించింది. అంతేకాదు.. పాకిస్తాన్‌లో ఉన్న భారతీయులంతా వెంటనే భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరికలు చేశారు.
పాక్‌తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, పాక్ జాతీయులకు అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇరుదేశాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దృష్టికి తీసుకెళ్లారు.






