- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇమ్రాన్ ఖాన్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
by Malleboina Mahesh |
పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) సంచలన ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను ఈసీపీ ఇష్యూ చేసింది.

X
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) సంచలన ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను ఈసీపీ ఇష్యూ చేసింది. గత ఏడాది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై అసభ్య పదజాలాన్ని ఉపయోగించారనే అభియోగాలపై జరుగుతున్న విచారణను ఇమ్రాన్ తప్పించుకొని తిరుగుతున్నందుకు ఈసీపీ ఈ మేరకు ఆర్డర్ ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపర్చాలని ఇస్లామాబాద్ ఐజీని ఆదేశించింది. నిసార్ దుర్రానీ నేతృత్వంలోని నలుగురు సభ్యుల ఈసీపీ బెంచ్.. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఫవాద్ చౌదరిపై కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి (జూలై 25) వాయిదా వేసింది.
Next Story






