ఇరాన్‌కు మరో దెబ్బ? బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే కొత్త రక్షణ మంత్రి మృతి!

by Ramesh Naini |   (  Updated:2026-03-03 13:33:00  IST  )

రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నూతన మంత్రి సయ్యద్ మజీద్ ఎబెన్ అల్-రెజా ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఇరాన్‌కు మరో దెబ్బ? బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే కొత్త రక్షణ మంత్రి మృతి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నూతన మంత్రి సయ్యద్ మజీద్ ఎబెన్ అల్-రెజా (Seyed Majid Ebn Al-Reza) ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల క్రితమే రక్షణ మంత్రి అమీర్ నాసిర్ జాదే మరణించగా, ఆయన స్థానంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సయ్యద్ మజీద్ ఇబెన్ అల్-రెజా కూడా ఇజ్రాయెల్ తాజా దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ 'ది స్పెక్టేటర్ ఇండెక్స్' వెల్లడించింది.

వరుస దాడులతో కుప్పకూలుతున్న నాయకత్వం

గత శనివారం జరిగిన భారీ దాడుల్లో రక్షణ మంత్రి నాసిర్ జాదే తో పాటు రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్‌పూర్ కూడా మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం తక్షణమే మజీద్ అల్-రెజాను కొత్త రక్షణ మంత్రిగా నియమించింది. అయితే, ఆయన పదవి చేపట్టిన 24 గంటలు గడవకముందే ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం ఇరాన్ సైనిక యంత్రాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసినట్లైంది. కాగా, కొత్త రక్షణ మంత్రి మృతిపై ఇంకా ఇరాన్ ప్రభుత్వ అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

similar News : మొస్సాద్‌ గురి పెడితే చావే.. ట్రాఫిక్ కెమెరాలే కాదు టూత్ పేస్టుతోనూ చంపిన చరిత్ర.. వైఫల్యాలు తప్పలేదు

Next Story