'నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నా' నెతన్యాహు అదిరిపోయే కౌంట‌ర్

by velandi.Saikiran |   (  Updated:2026-03-15 18:32:51  IST  )

నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నా  నెతన్యాహు అదిరిపోయే కౌంట‌ర్
X

దిశ‌, వెబ్ డెస్క్: 'నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నా ' అంటూ ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజమిన్ నెతన్యాహు ( Benjamin Netanyahu) అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు చనిపోయారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఫేక్ ప్ర‌చారం నేపథ్యంలో స్వ‌యంగా ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఇజ్రాయెల్ లోని ఒక కేఫ్ లో కాఫీ తాగుతూ మాట్లాడిన వీడియోని రిలీజ్ చేశారు.

తాను చావలేదని.. బ్రతికే ఉన్నానని ప్రపంచానికి చెప్పేందుకే ఈ వీడియో విడుదల చేశారు బెంజమిన్ నెతన్యాహు. దీంతో ఈ వీడియో వైర‌ల్ గా మారింది. కాగా, నిన్న‌టి రాత్రి నుంచి బెంజమిన్ నెతన్యాహు మృతి చెందార‌ని వార్త‌లు వైర‌ల్ చేసింది ఇరాన్‌. కానీ ఇజ్రాయెల్ స‌ర్కార్ ఖండించింది. ఇక ఇప్పుడు స్వ‌యంగా బెంజమిన్ నెతన్యాహు వీడియో విడుద‌ల చేసి, ఇరాన్ కు కౌంట‌ర్ ఇచ్చాడు.

అయితే, నెతన్యాహు చ‌నిపోయాడ‌ని ఇప్ప‌టికీ గ‌ట్టిగా చెబుతోన్న ఇరాన్... అత‌డు కాఫీ తాగిన వీడియో కూడా ఏఐ అని చెబుతోంది. యుద్ధం భ‌యంక‌రంగా జ‌రుగుతోన్న నేప‌థ్యంలో జాలిగా కాఫీ తాగే ఛాన్స్ ఉంటుందా ? అంటూ స్ప‌ష్టం చేస్తోంది ఇరాన్‌. మ‌రి ఇందులో ఏది వాస్త‌వమో, భ‌విష్య‌త్తే తేల్చ‌నుంది. కాగా ఇరాన్‌, ఇజ్రాయెల్ - అమెరికా మ‌ధ్య యుద్ధం కొనసాగుతోన్న సంగ‌తి తెలిసిందే. రెండు వారాలుగా ఈ మూడు దేశాల మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతోంది.

Next Story