- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుబాయ్ విమానాశ్రయంపై క్షిపణుల దాడి? మంటల్లో విమానం.. వీడియో వైరల్!
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరానియన్ క్షిపణులు విరుచుకుపడ్డాయంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో, ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకపడుతోంది. తాజాగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరానియన్ క్షిపణులు విరుచుకుపడ్డాయంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో కలకలం రేపుతోంది.
నలుమూలల దట్టమైన నల్లటి పొగ..
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, విమానాశ్రయ ప్రాంగణంలో క్షిపణి పడటంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఎయిర్‌పోర్టులో నిలిచి ఉన్న ఒక విమానం ఈ దాడిలో పూర్తిగా చిక్కుకుపోయింది. మంటల ధాటికి ఆ విమానం దాదాపు పూర్తిగా ధ్వంసమైనట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. విమానాశ్రయం నలుమూలల నుంచి దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వీడియోలో కన్పిస్తోంది. కాగా నిన్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్ దేశాలన్నీ హై అలర్ట్‌లో ఉన్నాయి. ఈ దాడి నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
గమనిక: ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా రూపొందించబడింది. దీనిపై అధికారికంగా దుబాయ్ ప్రభుత్వం ఇంకా ధృవీకరించాల్సి ఉంది.






