పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల ముగింపు.. 25 ఏళ్ల అనుబంధానికి తెర

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-04 09:23:06  IST  )

ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌కు షాకిచ్చింది.

పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల ముగింపు.. 25 ఏళ్ల అనుబంధానికి తెర
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ (Microsoft) పాకిస్థాన్‌కు (Pakistan) షాకిచ్చింది. ఎటువంటి అధికారిక సమాచారం లేకుండానే, పాకిస్థాన్‌‌లోని తమ కార్యాలయాన్ని మూసివేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధిపతి జావాద్ రెహ్మాన్ ఈ వార్తను ఒక శకం ముగింపు అంటూ పోస్ట్ షేర్ చేశారు. మైక్రోసాఫ్ట్ 2000వ సంవత్సరంలో పాకిస్థాన్‌లో ప్రవేశించి అక్కడి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి సహకరించింది. ప్రభుత్వ సంస్థలతో పాటు విద్యా రంగంతో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. అక్కడి విద్యార్థులకు డిజిటల్ స్కిల్ల్స్ అందించడానికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.

మైక్రోసాఫ్ట్‌ తమ కార్యకలాపాలు ఎందుకు ఆపేసిందన్నదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ, పాకిస్థాన్ అస్థిర ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, విఫలమైన వ్యాపార విధానాలు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ముందస్తు హెచ్చరిక లేకుండా కార్యకలాపాలను నిలిపివేయడం టెక్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఇక 2024 ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్ వాణిజ్య లోటు 24.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జూన్ 2025లో నిల్వలు కేవలం 11.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది టెక్ దిగుమతులు, విదేశీ పెట్టుబడులను తీవ్రంగా ప్రభావితం చేసింది.మల్టీనేషన్ నేషనల్ కంపెనీలను కొనసాగించేదుకు అవసరమైన రాజకీయ,ఆర్థిక పరిస్థితులు లేకపోవడం ప్రధాన ఆందోళనగా కనిపిస్తోంది.

కాగా 2022 తర్వాత మైక్రోసాఫ్ట్ తన వ్యాపారాన్ని పాకిస్థాన్‌లో విస్తరించాలని యోచించింది. అయితే పాకిస్థాన్‌లో పెరుగుతున్న అస్థిరత కంపెనీనీ వియత్నాం వైపు మొగ్గుచూపేలా చేసింది. రెండేళ్లుగా పాకిస్థాన్‌లో తన వ్యాపార మద్దతును తగ్గించింది. ఇక ఇప్పుడు పూర్తిగా మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ రీజియన్ సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

Next Story