తైవాన్‌లో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు జారీ

by Dishanational2 |
తైవాన్‌లో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు జారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: తైవాన్‌ రాజధాని తైపీలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4తీవ్రతగా నమోదైంది. భూకంపం ధాటికి తైపీలోని అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. తూర్పు తైవాన్‌లోని హువాలియన్ నగరానికి 18కిలోమీటర్ల దూరంలో 34.8కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) తెలిపింది. ప్రస్తుతం ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు. అయితే భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రైలు సేవలను నిలిపివేశారు. అంతేగాక పాఠశాలలు మూసివేశారు. భూకంపం కారణంగా కొండచరియలు సైతం విరిగిపడ్డట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవర్ ప్లాంట్లు సైతం దెబ్బతినడంతో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది.

ఈ ప్రకంపనల తర్వాత తైవాన్, జపాన్, పిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో 3 మీటర్ల ఎత్తులో అంటే దాదాపు 10 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. అయితే తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపం వల్ల సునామీ ముప్పు దాటిపోయిందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. తైవాన్ పర్యావరణ సంస్థ ప్రకారం..గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపం. అంతకుముందు1999లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించగా.. సుమారు 2 వేల మందికి పైగా మృతి చెందారు.

Next Story

Most Viewed