జమ్మూకశ్మీర్ లో క‌ల‌కలం.. పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు !

by velandi.Saikiran |

ఈ సంఘ‌ట‌న‌లో దాదాపు 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయ‌ని అంటున్నారు.

జమ్మూకశ్మీర్ లో క‌ల‌కలం.. పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారతదేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మొన్న ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత, భ‌యం గుప్పిట్లో ప్ర‌జ‌లు బ‌తుకుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న‌ పోలీసులు కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో అర్ధరాత్రి పేలుడు కలకలం రేపింది. మొన్న ఢిల్లీలో బాంబు పేలుడు సంఘటన మరువక ముందే ఇప్పుడు జమ్మూకశ్మీర్ లో పేలుడు సంభవించింది.

శ్రీనగర్ లోని ( Srinagar) నౌగామ్ పోలీస్ స్టేషన్ ( Nowgam Police Station) ఆవరణలోనే సీజ్ చేసిన అమ్మోనియం నైట్రేట్ బ్లాస్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక పేలుడు దాటికి పలు వాహనాలు కూడా ధ్వంసం అయినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సంఘ‌ట‌న‌లో దాదాపు 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయ‌ని అంటున్నారు. ఇటీవల యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ లో ఈ స్టేషన్ కీలకంగా వ్యవహరించింది. కాగా ఇది ఉగ్ర‌దాడి కాద‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని అక్క‌డి పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది. క్లిక్

Next Story